రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

by Sridhar Babu |
Kumbham Anil kumar
X

దిశ, భువనగిరి రూరల్ : రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు వచ్చాయని, ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారం చేపడుతుందని యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కుంభం ఆధ్వర్యంలో భువనగిరి, వలిగొండ, భూదాన్ పోచంపల్లి, బీబీనగర్ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా హైదరాబాద్ వెళ్లారు. రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

Kumbham

అనంతరం కుంభం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపి, రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని కోరారు. రేవంతన్న నేతృత్వంలో ప్రభుత్వంపై పోరాటాలు ఉధృతం చేస్తామని కుంభం అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

DCC President Kumbham

Advertisement

Next Story

Most Viewed