- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్ : సీఎం దత్తత గ్రామంలో దళితులకు ఘోర అవమానం
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మోతేలో దళితులను బహిష్కరణ చేసింది గ్రామాభివృద్ధి కమిటీ. గ్రామంలోని ఊరులో ఉన్నా 8 ఎకరాల భూమిలో దోబిఘాట్ నిర్మాణంకు మాల, మాదిగ సంఘాలు నిరాకరించడంతో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం మోతేలో బహిష్కరణ చోటు చేసుకుంది. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు మోతే గ్రామ దళిత సంఘాల సభ్యులు తరలి వచ్చి ధర్నా నిర్వహించారు. విడీసీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మోతే గ్రామంలో అంటారని కులాల వారు ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఊరుమీద ఉన్నా 8 ఎకరాల్లో ఉన్న స్థలం కేటాయించాలని కోరగా విడీసీ నిరాకరించింది. అదే విధంగా గ్రామంలో చాకలి కులస్తులు అంటరాని కులాల వారి దుస్తులు ఇతర కులాల వారి బట్టలతో కలిసి పిండవద్దని ఆదేశించారు. ఇటీవల వీడీసీ ఊరు మీదా స్థలంలో దోబిఘాట్ నిర్మాణం చెప్పట్టాలని నిర్ణయించగా మాల మాదిగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసారు. దానితో దళితులను బహిష్కరణ చేసింది విడీసీ ఆదేశాలతో కులవృత్తుల వారు దళితులు పని చేయడం మాని వేసి కనీసం వ్యవసాయానికి కూడా సహకరించడం లేదు. దోబీ ఘాట్ నిర్మాణంకు ఒప్పుకుంటేనే దళితుల బహిష్కరణ ఎత్తి వేస్తామని వీడీసీ తొమ్మిది మంది వేదిస్తున్నారు అని గ్రామ దళితులు వాపోయారు.