- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఎఫెక్ట్: వర్క్ ఫ్రమ్ హోమ్.. థర్మల్ స్క్రీనింగ్
మహమ్మారి కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి నేపథ్యంలో ప్రైవేటు సంస్థలూ అప్రమత్తమయ్యాయి. తమ ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నాయి. జ్వరం లక్షణాలు ఉంటే ఇంటి దగ్గరనే ఉండిపోవాలని సూచిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కొన్ని అంతర్జాతీయ ఐటీ సంస్థలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ను ప్రకటించాయి. మరికొన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కేటాయించకున్నా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కరోనా లక్షణాలపై ముద్రించిన బుక్‌లెట్‌లను అందజేస్తున్నాయి. సంస్థల్లో పెద్ద ఎత్తున అవగాహన పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతి ఉద్యోగికీ ప్రత్యేకంగా ఒక్కటి చొప్పున శానిటైజర్ల అందజేస్తున్నాయి. దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్ హైదరాబాద్ శరీర ఉష్ణోగ్రతలను స్కీనింగ్ చేసిన తర్వాతనే ఉద్యోగులను లోనికి అనుమతిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగుల అభీష్టం మేరకు వర్క్ ఫర్ హోమ్ అవకాశం కూడా కల్పిస్తోంది.