ఐటీ దాడుల పూర్తి పంచనామా విడుదల..

by srinivas |
ఐటీ దాడుల పూర్తి పంచనామా విడుదల..
X

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పర్సనల్ సెక్రెటరీ శ్రీనివాస్‌రావు ఇంటిపై జరిపిన దాడుల్లో ఐటీశాఖ అధికారులు పలు కీలక వివరాలను సేకరించారు. అందుకు సంబంధించిన దస్త్రాలు, కీలక డాక్యుమెంట్లను పరిశీలించిన ఐటీశాఖ పూర్తి వివరాలతో కూడిన పంచనామా రిపోర్టులను సోమవారం విడుదల చేశారు. ఐటీ దాడుల్లో రూ.2వేల కోట్లకు పైగా స్కాం బయట పడిందని వైసీపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో ఐటీశాఖ అలాంటిది ఏమీలేదని దాడుల్లో కేవలం రూ.2లక్షల మేర నగదు లభ్యమైందని, అది కూడా తిరిగి శ్రీనివాస్ రావుకు ఇచ్చేసినట్టు తెలిపారు. ఈ తతంగమంతా జరిగిన కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే పూర్తి వివరాలతో ఉన్న పంచనామాను ఐటీశాఖ విడుదల చేయటం గమనార్హం. అయితే ఇందులో భారీగా డైరీలు,డాక్యుమెంట్లు,రిజిస్టర్‌లు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా ఏబీ సుబ్బారావుకు చెందిన లాకర్‌ను సీజ్ చేసినట్టు పంచనామాలో వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed