- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. మరోసారి దద్దరిల్లిన గాజా
దిశ, వెబ్‌డెస్క్: మరోసారి గాజా లో బాంబుల మోతతో దద్దరిల్లింది. గాజాసిటీ పై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. ఉభయ పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెలరోజులు కూడా కాకముందే గాజా సిటీ బాంబుల మోతతో మారుమ్రోగింది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాలపై పాలస్తీనా పేలుడు పదార్థాలతో కూడిన బెలూన్లను ప్రయోగించడంతో ఇజ్రాయెల్ కూడా ప్రతీకారానికి దిగింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన విమానాలు గాజాలోని ఖాన్ యూనిస్ అనే ప్రదేశంపై దాడులు చేశాయి. పేలుడు పదార్థాలతో కూడిన బెలూన్లను పలు ప్రదేశాల్లో విసిరేశాయి. ఈ బెలూన్ ల కారణంగా పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఖాన్ యూనిస్ ప్రాంతంలో హమాస్ కార్యకలాపాలు సాగిస్తున్నారన్న అనుమానంతోనే ఇజ్రాయెల్ బాంబులు కురిపించింది. గాజా సిటీ మొత్తంలో 20 చోట్ల అగ్నిప్రమాద ఘటనలు సంభవించినట్లు ఇజ్రాయెల్ ఫైర్ సర్వీస్ తెలిపింది.
https://t.co/Sb14PuvIeU pic.twitter.com/VpmuGSitxK
— افيخاي ادرعي (@AvichayAdraee) June 15, 2021