'నా వీడియోలు నేనే చూసుకొని నా లోపాలను గుర్తించాను'

by Shyam |
Rohith-2
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2020లో సూపర్ ఫామ్‌లో ఉండి ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత ఏకంగా టీమ్ ఇండియాలో స్థానం సంపాదించాడు. టీ20 వరల్డ్ కప్ జట్టులో కూడా చోటు దక్కడంతో ఇషాన్ కిషన్‌పై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఐపీఎల్ 2021లో మాత్రం ఇషాన్ కిషన్ బ్యాటుతో తడబడ్డాడు. రెండో దశలో ఫామ్‌లో లేకపోవడంతో అతడిని జట్టునుంచి తప్పించాడు. అయితే రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తిరిగి చోటు దక్కించుకున్న కిషన్.. కేవలం 25 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి తిరిగి ఫామ్ అందుకున్నాడు. తాను తిరిగి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడానికి కారణం ముగ్గురు వ్యక్తులు అని చెప్పాడు. ‘ఏ క్రీడాకారుని జీవితంలో అయిన ఒడుదుడుకులు సహజం. నేను కూడా అలాంటి పరిస్థితిని అనుభవించాను. గతంలో మాదిరిగా పరుగులు చేయకపోవడం నన్ను కలవరపరిచింది. అయితే విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కిరాన్ పొలార్డ్‌లతో మాట్లాడాను. వాళ్లు విలువైన సలహాలు ఇచ్చారు. నేను గత సీజన్‌లో బ్యాటింగ్ చేసిన వీడియోలు చూడమన్నారు. నా వీడియోలు నేనే చూసుకొని నా లోపాలను గుర్తించాను. అవి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఇక ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నాకు అండగా ఉన్నాడు’ అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed