‘బిగ్ బాస్ 4’ విన్నర్ డిసైడ్ అయిపోయాడా?

by Anukaran |   ( Updated:2020-12-07 07:05:14.0  )
‘బిగ్ బాస్ 4’ విన్నర్ డిసైడ్ అయిపోయాడా?
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 4 ఆడియన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ పంచడంలో సక్సెస్ అయింది. ఈ రియాలిటీ షో ఆదివారంతో 13 వారాలు కంప్లీట్ చేసుకోగా, ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న ఆరుగురు సభ్యులు అభిజిత్, అఖిల్, అరియానా, సోహైల్, మోనాల్, హారిక ఫినాలే రేస్‌లో నిలిచారు. ఓ వైపు నామినేషన్స్ కూడా జరుగుతుండగా, టాప్ – 5లో నిలిచేది ఎవరనే ఎగ్జైట్‌మెంట్ అందరిలోనూ నెలకొంది. కానీ బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరు? అనే విషయంలో మాత్రం చాలా మందిలో ఆ ఎగ్జైట్‌మెంట్ లేకపోవడం గమనార్హం. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్‌గా అభిజిత్ సెలెక్షన్ ఆల్రెడీ జరిగిపోయిందని సోషల్ మీడియాలో టాక్ రావడమే ఇందుకు కారణం.

అభిజిత్ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నాగార్జున సతీమణి అమలతో కలిసి నటించిన విషయం తెలిసిందే. కాగా, వారి సపోర్ట్‌తోనే అభి కంటెస్టెంట్‌గా సెలెక్ట్ అయి హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడని తెలుస్తోంది. ఫస్ట్ నుంచి తను టాస్క్‌లు సరిగ్గా చేయకపోయినా సరే, దాని గురించి ప్రశ్నించకుండా.. ఆ వారంలో తను చేసిన హైలెట్ ఇష్యూస్ ఏమున్నాయో మాత్రమే చెప్పుకొస్తున్నాడు హోస్ట్ నాగార్జున. ఒకవేళ అభి తప్పు చేసినా, ఆ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో స్వయంగా నాగార్జునే ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరిస్తూ.. అందులోనూ పాజిటివ్‌నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికి ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు నాగ్.. అభికి సపోర్ట్ చేస్తూనే వచ్చాడు. ఒక వేళ తప్పు జరిగిందని ఫీడ్ బ్యాక్ ఇస్తే అభి ఓవరాక్షన్ చూడాలి. కాళ్ల మీద కూర్చుని క్షమించమని అడగడాలు.. ఏదో మునిగిపోయినంతగా ఫీల్ అవ్వడాలు.. వంటివి హైలెట్ చేశారు. ఆ తర్వాత నాగ్‌‌తో మాట్లాడేందుకు కన్ఫెషన్ రూమ్‌కు వెళ్లడం.. ఆ సమయంలో కింగ్ నాగార్జున తనకు బూస్టప్ ఇవ్వడం.. ఇలా మొత్తానికి అభికి నెగెటివ్ మార్క్ ఉండకుండా జాగ్రత్త పడ్డాడు.

ఇక బయట అసలు అభిజిత్‌కు అభిమాన సంఘాలు ఎందుకు ఏర్పడ్డాయో కూడా తెలియదు. దాదాపు ప్రతీ వీక్ ఎలిమినేషన్‌లో ఉన్న అభికి అభిమాన సంఘాల ఏర్పాటు కూడా ఓ ప్లాన్ అనేది టాక్. దీనిపై మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. సోహెల్, అరియానా లాంటి జెన్యూన్ ప్లేయర్స్.. ముఖ్యంగా ప్రతీ విషయంలోనూ క్లారిటీగా ఉండే సోహైల్‌కు ఆడియన్స్ నుంచి సపోర్ట్ ఉన్నా సరే, చివరిగా విజేత మాత్రం అభిజిత్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బిగ్ బాస్ సీజన్ 4 అంతా స్ర్కిప్ట్ ప్రకారమే తప్ప, ఈ రియాలిటీ షోలో రియాలిటీ ఏమీ లేదని, ప్రేక్షకుల ఓటింగ్‌కు వాల్యూ లేదని స్పష్టమవుతోంది.

Advertisement

Next Story