- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ మహిళ తో ఎఫైరే బిల్ గేట్స్ విడాకులకు కారణమా.. ?
దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన భార్య మిలిందాతో విడిపోయిన విషయం తెలిసిందే.. అయితే అప్పటినుండి ఈ జంట విడిపోవడానికి గల కారణాలను నెటిజన్లు వెతుకుతూనే ఉన్నారు. ఇక ఎక్కువగా బిల్ గేట్స్ తన భార్య మిలిందా విడిపోవడానికి ప్రధాన కారణం బిల్ గేట్స్ వివాహేతర సంబంధమేనని తెలుస్తోంది. ఇక అంతేకాకుండా తన సంస్థలో నుండి వైదొలగడానికి కూడా ఈ సంబంధమే కారణమని వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. హత కొన్నేళ్ల క్రితం బిల్ గేట్స్ తన సంస్థలో పనిచేసే మహిళా ఇంజనీర్‌తో లైంగిక సంబంధం పెట్టుకోవాలని అనుకున్నారని, దానికి ఆ మహిళ అంగీకరించకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మైక్రోసాఫ్ట్ ఉద్యోగి చేసిన అభియోగంపై 2019 చివరిలో మైక్రోసాఫ్ట్ సంస్థ దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకోసం బయటి న్యాయ విచారణ సంస్థను నియమించిందని ఆ పత్రిక తెలిపింది. అయితే, ఈ ఆరోపణలపై దర్యాప్తు పూర్తికావడానికి ముందే బిల్‌గేట్స్ రాజీనామా చేశారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇక ఉద్యోగితో బిల్‌గేట్స్‌కు వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని గేట్స్ అధికార ప్రతినిధి అంగీకరిస్తూనే, దీనికి గేట్స్ బోర్డు నుండి వైదొలగానికి సంబంధం లేదనిస్పష్టం చేశారు. ఇక ఈ వివాహేతర సంబంధమే భార్యాభర్తల మధ్య బంధాన్ని బీటలువారేలా చేసి ఉంటుందని ఊహాగానాలు తలెత్తుతున్నాయి.