- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చైనాకు పాకిస్తాన్ ఒక కాలనీ : అమెరికా
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు రోజురోజుకూ బీటలు వారుతున్నాయి. ఒకవైపు చైనాతో సంబంధాలు కొనసాగిస్తూనే.. అమెరికా నుంచి లక్షల కోట్ల డాలర్ల నిధులను పాకిస్తాన్ పొందుతున్న వైనంపై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. ఇప్పటికే అమెరికాకు తెలియకుండా అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాను సవరించడం, కరోనా పేరుతో జైళ్ల నుంచి వాళ్లను విడుదల చేయడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై అమెరికా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ కేవలం చైనాకు ఒక కాలనీ కంటే ఎక్కువ కాదని అమెరికా అమెరికా అభిప్రాయపడింది. ఇదే విషయంపై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబెన్ మాట్లాడుతూ.. భారత్, అమెరికాల మధ్య సత్సంబంధాలు ఏర్పడటంతో పాకిస్తాన్, చైనా చేతులు కలిపాయని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఎంత రాసుకొని తిరిగినా చైనా మాత్రం దాన్ని ఒక వ్యాపార భాగస్వామిగా ఎప్పటికీ చూడదని.. దాన్ని వాడుకొని వదిలేయడమే చైనా ముఖ్య ఉద్దేశమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని త్వరలోనే పాకిస్తాన్ తెలుసుకుంటుందని రూబెన్ చెప్పారు.
Tags : Pakistan, China, Colony, Michael Ruben