- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలో ఎన్నికలు వాయిదా?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే విద్యాసంస్థలను బంద్ చేయడంతో పాటు టెన్త్, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కరోనా కోరలు చాచుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలందరూ గుమిగూడతారు గనుక కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశముంది. దీంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం సందిగ్ధంలో పడింది. ఎన్నికలు నిర్వహించాలా? లేదా? అనే దానిపై తర్జనభర్జనలు పడుతోంది.
కాగా, గురువారం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం జారీ చేసిన విషయం తెలిసిందే. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్ధిపేట, నకేరేకల్, అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూర్ మున్సిపాలిటీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనుండగా.. మే 3న ఫలితాలు వెలువడనున్నాయి.