- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
10 వేల మందికి బయోబబుల్ ఎలా ఏర్పాటు చేస్తారు?
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తుండటంతో జపాన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో ఈ ఏడాదైనా ఒలంపిక్స్ జరుగుతాయో లేదో అనే అనుమానాలు వస్తున్నాయి. తాజాగా టెన్నిస్ స్టార్లు సెరేనా విలియమ్స్, నయోమీ ఒసాక ఒలంపిక్స్ నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మెగా ఈవెంట్‌లో అథ్లెట్లు, కోచ్‌లు, ఇతర సిబ్బంది కలసి దాదాపు 10 వేల మంది జపాన్ వస్తారు. అయితే ఇంత మందికి బయోబబుల్ ఎలా ఏర్పాటు చేయస్తారని వారు నిలదీస్తున్నారు. అది సాధ్యమయ్యే పనేనా.. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో అంత పెద్ద బబుల్ ఏర్పాటు కష్టం కాదా అని నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. తన కూతురుని విడిచి ఇంత వరకు ఒక్క రోజు కూడా లేనని.. ఇప్పుడు తన కుమార్తెను వదిలి ఒలింపిక్స్‌లో ఎలా పాల్గొనాలని.. సెరేనా అన్నారు.
జపాన్‌లో పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతున్న సమయంలో ఒలింపిక్స్ జరగాలని నేను కోరుకోలేనని ఒసాకా అన్నారు. ఇక జపాన్ మాజీ టెన్నిస్ క్రీడాకారుడు నిషికొరి కూడా ఒలింపిక్స్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం కష్టమే అని అభిప్రాయపడ్డాడు.