నా చేతిలో బిడ్డను పెట్టేవరకు నిద్రపోరా? నటి హాట్ కామెంట్స్

by Shyam |   ( Updated:2021-10-25 07:37:00.0  )
bipasha basu
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ బెస్ట్ కపుల్స్‌ బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్‌ వివాహం 2016లో జరిగింది. ఆ తర్వాత బిపాసా సినిమాలకు దూరం కాగా.. ఆమె బరువు పెరిగినప్పుడల్లా ప్రెగ్నెన్సీతో ఉందనే పుకార్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బిపాసా గర్భవతి అంటూ మరోసారి ప్రచారం జరుగుతోంది. ఈ ఫేక్ న్యూస్‌పై స్పందించిన నటి.. ‘నేను ఫిట్‌నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌నని అందరికీ తెలుసు. కానీ, నాకు కూడా జీవితంలో చిన్న చిన్న కోరికలుంటాయి. అందరిలాగే జీవితాన్ని గడపాలని ఉంటుంది. ప్రస్తుతం నా లైఫ్‌ను ఆస్వాదిస్తున్నా. ఈ టైమ్‌లో బరువు పెరిగినంత మాత్రాన అనారోగ్యంతో ఉన్నట్లు లేదా గర్భవతిని అయినట్టు కాదు. నిజంగా బిడ్డకు జన్మనిచ్చే వరకు ప్రెగ్నెన్సీ రూమర్స్ ఆపలేరనే విషయం నాకు అర్థమైంది. అయితే మీరు నా మంచి కోరుకుంటున్నారని తెలుసు. నా కుటుంబం గురించి ఆలోచిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని తెలిపింది.

Advertisement

Next Story