- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
బాబర్ ఆజమ్.. కోహ్లీ అంతటి వాడయ్యేనా ?
పాకిస్తాన్ క్రికెట్ సంచలనం బాబర్ ఆజమ్.. ప్రస్తుత తరం పాక్ క్రికెటర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న బ్యాట్స్‌మన్. అతన్ని అక్కడి అభిమానులు పాకిస్తాన్ కోహ్లీ అంటూ పిలుచుకుంటారు. మరికొందరు పాకిస్తానీయులైతే ఏనాటికైనా కోహ్లీని మించిన క్రికెటర్ అవుతాడని చెబుతుంటారు. బాబర్ ఆజమ్ కూడా ఏదో ఒక రోజు కోహ్లీని మించిపోవాలని కలలు కంటూనే ఉన్నాడు. తనకు కోహ్లీలా ఆడాలని ఉందని, అతనిలా లెజెండరీ బ్యాట్స్‌మన్ అని పిలిపించుకోవాల నుందని గతంలోనే చెప్పాడు.
నిజానికి బాబర్ ఆజమ్.. ఆషామాషీ క్రికెటరేం కాదు. టాలెంట్, టెక్నిక్ పుష్కలంగా ఉన్న బ్యాట్స్‌మన్. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్, వన్డేల్లో నెంబర్ 3, టెస్టుల్లో నెంబర్ 5 ర్యాంకుల్లో కొనసాగుతూ.. అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్ అనిపించుకున్న ఏకైక పాక్ బ్యాట్స్‌మన్. మరి ఆజమ్.. కోహ్లీ అంతటి వాడు అవుతాడా..? కోహ్లీని మించిపోయే రికార్డులు సృష్టిస్తాడా అంటే.. క్రికెట్‌లో ఎవరి రికార్డులు శాశ్వతం కాదు. ఎందుకంటే సచిన్ రికార్డుల చేరువలోకి కూడా ఎవరూ రాలేరని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం సచిన్ సెంచరీ రికార్డులను బద్దలు కొట్టే వాడు కోహ్లీనే అని అందరూ అంటున్నారు. ఇక కోహ్లీ తర్వాత ఆ టాలెంట్ బాబర్ ఆజమ్ సొంతం. కాకపోతే బాబర్ తన ఆటను ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు క్రీజులో ఉన్నప్పుడు అతడు కాస్త సహనాన్ని అలవర్చుకోవాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు. కోహ్లీ స్థాయికి చేరాలంటే బాబర్ గేమ్‌పై ఇంకా దృష్టి సారించాల్సిందే. ఇదే విషయంపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్, వ్యాఖ్యాత రమీజ్ రాజా కూడా స్పందించారు.
‘ప్రస్తుత తరంలో కోహ్లీని మించే అన్ని లక్షణాలు బాబర్ ఆజమ్‌లో ఉన్నాయి. కోహ్లీ కంటే గొప్ప ఆటగాడయ్యే సామర్థ్యం బాబర్‌లో ఉంది. కానీ కోహ్లీని దాటాలంటే ఆజమ్ తన గేమ్‌ను మెరుగుపర్చుకోవాలి. సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేస్తూ విజయాలు అందించాలి. అతడు తన మనసును ప్రశాంతంగా ఉంచుకొని.. ఒక సానుకూల ధోరణితో క్రికెట్ ఆడాలని’ రమీజ్ సూచించాడు. కోహ్లీ ఎంత ఒత్తిడిలో ఉన్నా ప్రశాంతంగా బ్యాటింగ్ చేస్తుంటాడని.. అందుకే ఛేజింగ్‌లో అతడి బ్యాటింగ్ యావరేజ్ ఎక్కువగా ఉంటుందని రమీజ్ గుర్తు చేశాడు. అదే విధంగా బాబర్ కూడా సుదీర్ఘ కాలం ఆటను శాసించాలంటే తప్పకుండా ఒర్పుతో గేమ్‌పై ఫోకస్ చేయాలని.. ఒత్తిడిని జయంచగలిగి జట్టుకు విజయాలు సాధించిపెట్టాలని రమీజ్ రాజా అన్నాడు. మరి బాబర్ ఇవన్నీ అలవర్చుకొని కోహ్లీని మించి లెజెండ్ అనిపించుకుంటాడా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. కోహ్లీ మరో నాలుగు నుంచి ఐదేండ్లు మాత్రమే క్రికెట్ ఆడగలడు. బాబర్ మరో 10 ఏండ్లు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. అప్పటికి కోహ్లీ సాధించే రికార్డులు ఎన్నో.. వాటిని బాబర్ ఛేదించగలడో లేదో కాలమే సమాధానం చెప్పాలి.
Tags : Virat Kohli, Ramiz Raja, Babar Azam, Pakistan, India