ప్రభాస్ 21 మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్?

by  |
ప్రభాస్ 21 మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్?
X

ప్రభాస్, నాగ్ అశ్విన్‌ కాంబోపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి ప్రేక్షకుల్లో ప్రత్యేకాసక్తి నెలకొంది. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా తీస్తుండటంతో.. టెక్నీషియన్స్‌ను కూడా ఆ రేంజ్‌లోనే సెట్ చేస్తున్నాడు నాగ్. ఇప్పటికే ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను అనౌన్స్ చేసి ఈ సినిమా క్రేజ్‌ను అమాంతం పెంచేశాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంగీత దర్శకున్ని డిసైడ్ చేసే పనిలో ఉంది చిత్ర బృందం. మరి ఆ లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?

ఆడియో ఆల్బమ్ హిట్టయితే.. ఆ సినిమా కూడా యాభై శాతం విజయం సాధించినట్లే అన్నది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ టాక్. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. అయితే ప్రభాస్ 21వ చిత్రానికి కీరవాణిని తీసుకుంటున్నారని గతంలో టాక్ వినిపించింది. కానీ, ఇప్పుడు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ‌మాన్ పేరు తెరపైకొచ్చింది. రెహమాన్ ఇటీవల కాలంలో తెలుగులో ఏ సినిమా చేయలేదు. చివరగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆఖరి చిత్రానికి రెహ‌మాన్ బాణీలు సమకూర్చగా.. ఆ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో తాజాగా రెహమాన్ కూడా తనకు అవకాశాలు రాకుండా ఓ గ్యాంగ్ అడ్డుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే తన దగ్గరకు ఎవరొచ్చినా మ్యూజిక్ అందిస్తానని ఓపెన్‌గానే చెప్పాడు. మరి ప్రభాస్ 21వ సినిమా యూనిట్ రెహ‌మాన్‌ను సంప్రదిస్తే.. దాదాపుగా ఓకే చెబుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రెహమాన్ రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువే అయినా.. ఆయన ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ దక్కుతుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నట్టు సమాచారం.


Next Story

Most Viewed