ఫాస్టెస్ట్‌గా 1 బిలియన్‌కు చేరనున్న 5జీ ?

by Harish |
ఫాస్టెస్ట్‌గా 1 బిలియన్‌కు చేరనున్న 5జీ ?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇది టెక్నాలజీ యుగం. రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తూనే ఉంటుంది. కానీ వచ్చిన వెంటనే అది సక్సెస్ అయిపోదు. ఆ కొత్తను అందిపుచ్చుకోవాలంటే.. మొదట అది అందరికీ అర్థమై చేరువ కావాల్సి ఉంటుంది. అప్పుడే సక్సెస్ సొంతమై దానికంటూ సపరేట్ యూజర్లు ఏర్పడతారు. టెక్నాలజీలోనూ విపరీతంగా మార్పులొస్తున్న ఈ క్రమంలోనే.. వాటికి మరింత వేగాన్ని జోడించేందుకు 5జీ టెక్నాలజీ వచ్చింది. 5జీ వల్ల పెనుమార్పులు వస్తాయని ఇప్పటికే టెక్ నిపుణులు భావిస్తుండగా.. 5జీ నెట్‌వర్క్ 1 బిలియన్ ప్రజల్ని చేరుకోవడానికి కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే పడుతుందని మొబైల్ కనెక్టెడ్ వరల్డ్ ‘స్టాటిస్టా’ అంచనా వేస్తోంది.

డెబిట్ కార్డులు ప్రపంచానికి పరిచయమైనప్పుడు.. అవి బిలియన్ ప్రజలను చేరుకోవడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. అదే ఆన్‌లైన్ బ్యాంకింగ్ వన్ బిలియన్ మార్కు చేరుకోవడానికి 19 ఏళ్లు పట్టాయి. అదే ఇంటర్నెట్ విషయానికి వచ్చే‌సరికి 14 ఏళ్లకే అది సాధ్యమైంది. 3జీకి 12 సంవత్సరాలు పట్టగా, 4జీ ఆ స్కోరును కేవలం నాలుగేళ్లలోనే సమం చేసింది. ఇప్పుడు అదే 5జీ విషయానికి వచ్చేసరికి 4జీ రికార్డును ఈజీగా బద్దలు కొడుతుందని స్టాటిస్టా అంచనా వేస్తోంది.

Advertisement

Next Story