- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ భూముల్లో టీఆర్ఎస్ నేతల అక్రమాలు.. చర్యలేవి..?
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: అసైన్మెంట్ రివ్యూ కమిటీ అనుమతి లేకుండా పట్టాలు చేసుకున్న భూదందాలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు, అధికారులు కలిసి ప్రభుత్వ భూములను అప్పనంగా కాజేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రధాన అనుచరుడు గడ్డం భీమాగౌడ్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట 32.11ఎకరాలు రాసుకోవటం సంచలనం కలిగిస్తోంది. సామాజిక కార్యకర్త ఇందూరి రామ్మోహన్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో అసలు విషయాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికారులను నిందితులుగా చూపుతున్నప్పటికీ, అధికార పార్టీ నేతల జోలికి ఎందుకు వెళ్లటం లేదనే విమర్శలూ ఉన్నాయి.
ఇది అసలు బాగోతం
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని జోగాపూర్, గొల్లపల్లి, మైలారం, ఘన్పూర్, నెన్నెల, మన్నెగూడెం, ఖర్జి, పప్పులవానిపేట, ఆవడం, ఖమ్మంపల్లిలో పలువురు నకిలీ పట్టాలు, పాస్ పుస్తకాలు పొందారని సామాజిక కార్యకర్త ఇందూరి రామ్మోహన్ హైకోర్టులో ప్రజాప్రయోజన దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో అప్పటి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విచారణ జరిపారు. 7,394.02 ఎకరాల ప్రభుత్వ భూమిలో 3236 మందికి 6292.30 ఎకరాలు అసైన్డ్ చేసినట్లు కోర్టుకు నివేదించారు. 178 మందికి సంబంధించి ఫిర్యాదులు ఉండగా, 90 మంది పట్టాలు సక్రమమే అని తేలింది. 88 మందికి సంబంధించిన 207.19 ఎకరాల పట్టాలు నకిలీవని గుర్తించారు. గొల్లపల్లిలో 24 మంది, జోగాపూర్లో 23 మంది, నెన్నెలలో 15 మంది, మైలారంలో ఎనిమిది మంది, ఘన్పూర్లో ఏడుగురు, మన్నెగూడెంలో ఆరుగురు, పుప్పలవానిపేటలో ముగ్గురు, కమ్మంపల్లిలో ఇద్దరు రైతులు ఇందులో ఉన్నారు.
బయటపడిందిలా
ప్రభుత్వ భూములకు సంబందించిన పహానీలు నమోదు చేయాలంటే అసైన్మెంట్రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఈ వ్యవహారంలో రికార్డులను ఎవరూ పట్టించుకోకపోవటంతో అక్రమాలు జరిగాయి. నెన్నెల తహసీల్దార్ కార్యాలయ ఆపరేటరుగా పని చేసిన నరేష్ డిజిటల్ కీని దుర్వినియోగం చేసి అప్పటి తహసీల్దార్ల సంతకాలతో రెవెన్యూ రికార్డుల్లోకి చేర్చారు. ఇప్పటికే నరేష్‌ను అరెస్ట్ చేయగా, ముగ్గురు తహసీల్దార్లు హరికృష్ణ, వీరన్న, రాజేశ్వర్, ఏడుగురు వీఆర్వోలు తిరుపతి, మల్లేశ్, వెంకటస్వామి, రాజన్న, ఇక్బాల్, మెహబూబ్, కరుణాకర్ ను నిందితులుగా చేర్చారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నేత గడ్డం బీమాగౌడ్ సింగరేణి కార్మికుడు. ఆయన భార్య గడ్డం కళ్యాణి నెన్నెల ఎంపీపీగా పని చేశారు. గతంలో అధికార అండతో 32.11ఎకరాల భూమిని ఆయనతో పాటు భార్య, కుటుంబ సభ్యుల పేరుతో రికార్డుల్లో రాయించారు. ఈ భూములకు ట్రాక్టరు వెళ్లేందుకు ఏకంగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.13 లక్షలు విడుదల చేయడం గమనార్హం. నకిలీ పట్టాదారు పెట్టి బ్యాంకుల్లో రూ. రెండు లక్షల చొప్పున రుణాలు కూడా పొందారు. పాస్ పుస్తకాలు రద్దు చేయడంతో రుణం చెల్లించడం లేదు. కంప్యూటర్ ఆపరేటరుతో పాటు పది మంది రెవెన్యూ అధికారులను బాధ్యులుగా చేస్తున్నారే గానీ, అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.