- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్.. కొత్తగూడెం సీటీవో ఆఫీసుల్లో అటెండర్ల హవా
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసుల్లో సిబ్బంది, అధికారుల దందా రాజ్యమేలుతోంది. తోడుతున్న కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఆఫీసుల్లోని ముగ్గురు అటెండర్లు నడిపిస్తున్న హవా అంతా ఇంతా కాదు. ఎవరికి వారు మేమేం తక్కువ కాదంటూ పోటాపోటీగా అవినీతి సొమ్మును మూటగట్టుకుంటుడడం గమనార్హం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ వీళ్లు షాడో ఆఫీసర్లుగా చలామణి అవుతున్నారని వారి గురించి తెలిసినవారు చెబుతుండడం విశేషం. మరి ఈ దందాలన్నీ సీటీవోకి తెలియదా? అంటే.. ఎందుకు తెలియదు..? అన్నీ తెలిసే జరుగుతుండడం గమనార్హం. ఇంత జరుగుతున్నా సదరు అధికారి కూడా ఏం మాట్లాడకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారా..? ఆయన్ను కూడా ఈ ‘ముగ్గురు’ ‘కావాల్సినవి’ ఇస్తూ మచ్చిక చేసుకుంటారట.
ఆఫీసుకు రాకుండా వేలల్లో జీతాలు..
సీటీవో1, సీటీవో2 రెండు ఆఫీసులకు కలిసి ఆరుగురు అటెండర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు మాత్రం ‘మహా ముదుర్లు’ అని వీరి గురించి తెలిసిన వారు చెప్పడం గమనార్హం. సీనియర్లు కానుక వీరికి జీతం రూ.50వేలకు పైగానే ఉంటుంది. ఇంత జీతం తీసుకుంటున్నా వీరు ఆఫీస్లకు వచ్చి బుద్ధిగా పనులు చేసుకుంటారా? అంటే అదీ లేదు. జీతంతో పాటు ప్రభుత్వ సొమ్మును కాజేస్తూనే బయట ‘దందా’లో ఈ ముగ్గురూ ఆరితేరినట్లు తెలుస్తోంది. వారం, పదిరోజులకోసారి వీళ్లు ఆఫీసులకు వస్తే మహా ఎక్కువట. అయినా ఆఫీసుల్లో జరిగే కార్యకలాపాలు, దందాలు మాత్రం యథావిధిగానే జరిగిపోతుంటాయని సమాచారం.
వీరు రాకున్నా ఆఫీసు పనులు జరిగిపోవడానికి ఓ ప్రైవేట్ వ్యక్తిని కూడా నియమించుకున్నట్లు తెలుస్తోంది. వీరే స్వయంగా జీతం ఇస్తూ ఆ వ్యక్తిని నియమించారంటే.. వీరి బయట ఆదాయం ఎంతుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆఫీసులకు సంబంధించి లావాదేవీలను నడిపించేందుకు ఆ ప్రైవేట్ వ్యక్తితోపాటు.. కారు డ్రైవర్లు కూడా సహాయపడుతుంటారు. ఇంకో విషయం ఎంటంటే.. ఈ ఆఫీసుల్లో పని చేసేవారందరూ వీరికి సంబంధించిన వ్యక్తులు, వీరు ఏం చెబితే అది చేసేవారు కావడం గమనార్హం.
ఆ అధికారికి ఏం కావాలంటే అది..
ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారి ఏం చర్యలు తీసుకోడా? అంటే.. ఆయన సైతం ఆఫీసుకు రావడం అంతంత మాత్రమేనని తెలుస్తోంది. దీంతో ఈ ముగ్గురు అటెండర్లు చెప్పినట్లు ఆయన సైతం వింటాడట. దానికి ఆయనకు ‘కావాల్సినవి’ రోజువారీగానో, నెలవారీగానో సమకూరుస్తుంటారనే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా ‘సార్’ను మచ్చిక చేసుకుంటూ వీరి దందా ‘ఇంటాబయటా’ కొనసాగించడం గమనార్హం. ఏళ్లుగా ఇక్కడే పాతుకుపోయి ఆ ముగ్గురూ చేస్తున్న అవినీతి వెలికితీస్తే అనేక విషయాలు బయట పడతాయని తెలుస్తోంది.
వీళ్లది చాలా లగ్జరీ లైఫ్..
వీళ్లు చేసేది అటెండర్ ఉద్యోగం అయినా.. వీరి లగ్జరీ లైఫ్ గడుపుతుంటారని వీళ్ల గురించి చెబుతున్నమాట. వీరు సాదాసీదాగా పైకి కనిపించినా కార్లలో తిరగడం.. బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టడం వీరు చేసే పని. అంతేకాదు.. మచ్చిక చేసుకున్న అధికారితోసైతం వీరు చేసే దందాలో పెట్టుబడులు పెట్టిస్తారని తెలుస్తోంది. ఒక్కొక్కరికి కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయంటే నమ్మ శక్యం కాదు. ఈ రోజుల్లో ఒక అటెండర్ జీతంపై మధ్యతరగతి కుటుంబం బతకాలంటేనే కష్టం.. అలాంటి రెండేళ్ల వ్యవధిలోనే ఏకంగా ఫ్లాట్లే కూడబెట్టుకుంటున్నారట. కోట్లాది విలువ చేసే ఆస్తులు సంపాదించుకున్నారని తెలుస్తుంది.
చర్చనీయాంశమైన ‘దిశ’ కథనం..
‘కమర్షియల్ అధికారుల కక్కుర్తి..’ అంటూ గురువారం దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశమైంది. కమర్షియల్ ట్యా్క్స్ అనేది వస్త్ర, వాణిజ్య, వ్యాపార వర్గాలతో సంబంధం ఉంటుంది కనుక ఆయా వర్గాల్లో భద్రాద్రి ఆఫీసుల్లో జరిగే అద్దెకార్ల అవినీతి బాగోతంపై చర్చ జరిగింది. కథనం ప్రచురితం కావడంతో.. కొత్తగూడెం సీటీవో ఆఫీసుల్లో పనిచేసే సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వాస్తవానికి ఒకే కారు అద్దెకు నడుస్తుండగా.. ఆఫీస్ ముందు మరో రెండు హైర్ కార్లు ప్రత్యక్షమవడం గమనార్హం. ఇక స్వయంగా కొంతమంది వ్యాపార వర్గాలు జీఎస్టీ పేరుతో సీటీవో ఆఫీసుల్లో పనిచేసే అటెండర్లు తమను ఏవిధంగా వేధిస్తున్నారో, తమ వద్ద డబ్బులు ఏవిధంగా వసూలు చేస్తారో ‘దిశ ప్రతినిధి’కి వివరించడం గమనార్హం. అంతేకాదు వారు చేసే మరికొన్ని దందాలను సైతం చెబుతూ తమ గోడు చెప్పుకున్నారు.
వారి దందా మామూలుగా లేదట..
ఇక ఆ ముగ్గురు అటెండర్ల దందా మామూలుగా లేదని స్వయంగా కొంతమంది ‘దిశ ప్రతినిధి’కి ఫోన్ ద్వారా చెబుతుండడం గమనార్హం. ఆఫీసుల్లో వారు చేసే దందా ఏంటి..? ప్రభుత్వ సొమ్మును ఏవిధంగా బిల్లుల రూపంలో పొందుతున్నారు..? ప్రభుత్వానికి వెళ్లాల్సిన లక్షల రూపాయల పన్నులు ఏవిధంగా పక్కదారి పడుతున్నాయి..? అధికారులను ఏవిధంగా మేనేజ్ చేస్తున్నారు..? ఆఫీసులకు రాకుండా బయట వీరు చేసే ‘రియల్’ దందా ఏంటి..? అక్రమ సొమ్ముతో వీరు సంపాదించిన ఆస్తుల చిట్టా ఎంత..? అనే విషయాలపై పూర్తి సమాచారం ఇస్తామంటుండడం గమనార్హం.