హరితహారంలో అక్రమహారం!

by Shyam |
హరితహారంలో అక్రమహారం!
X

దిశ, మహబూబ్‎నగర్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో అవినీతి అక్రమాలు బయటపడ్డాయి. ఏకంగా లేని మొక్కలపై వివిధ రకాల బిల్లుల చెల్లింపులు జరిగినట్లు అధికారులు గుర్తించి ఒక్కసారిగా షాక్ అయ్యారు. మహబూబ్‎నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో జిల్లా అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. అయితే, దేవరకద్ర రోడ్డు నుంచి హజీలపూర్ వరకు 85 శాతం మొక్కలు బ్రతికే ఉన్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ, అధికారుల తనిఖీల్లో కేవలం 10 శాతం మొక్కలు సజీవంగా ఉన్నట్లు తేలింది. ఈ వ్యవహారంలో దేవరకద్ర సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లేని మొక్కలపై తప్పుడు బిల్లులు రాసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని అధికారులు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed