డబుల్ బెడ్‌రూం ఇళ్లలో అక్రమాలు : దుబ్బ రాజశేఖర్ గౌడ్

by Shyam |   ( Updated:2021-09-02 06:13:13.0  )
bjp leaders
X

దిశ, దేవరుప్పుల: మండలంలోని పెద్దమడూర్ గ్రామంలో గత వారం క్రితం అధికార పార్టీ నాయకులు డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని బీజేపీ నాయకులు దుబ్బ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. అర్హులకు కాకుండా అధికార పార్టీ నాయకులు ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్లను పోందడానికి శంకుస్థాపన చేశారని, ఈ శంకుస్థాపన చేసిన ఇండ్లను అర్హులకు అందేలా చూడాలని స్థానిక ఎమ్మార్వో శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దమడూర్ గ్రామంలోని దుర్గమ్మ గుడి వద్ద నూతనంగా పది డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారని వెల్లడించారు.

పేదలకు చెందాల్సిన ఈ డబుల్ బెడ్‌రూం ఇండ్లు, పేదలకు అందకుండా గ్రామంలో కొంత మంది అధికార పక్ష నాయకులు లబ్దిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు. అర్హులైన వారికి మాత్రమే డబుల్ బెడ్ రూం ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశామన్నారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దగౌని రాజు, నల్లా వెంకటేశ్వర్లు, సంగి రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed