బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ కీలక ఆదేశాలు!

by Harish |
బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ కీలక ఆదేశాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: బీమా కంపెనీలు మానసిక జబ్బులు, శారీరక వైకల్యం, హెచ్ఐవీ లాంటి వ్యాధులు సంక్రమించిన వారికి బీమా కవరేజీ ఎలా ఇస్తున్నారనే అంశంపై నిబంధనలను స్పష్టంగా చెప్పాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) ఆదేశాలిచ్చింది. ఆయా కంపెనీలు ఈ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలని తెలిపింది. దీంతో బీమా రంగంలో పారదర్శకత పెరుగుతుందని స్పష్టం చేసింది. మానసిక జబ్బులు, శారీరక వైకల్యం, హెచ్ఐవీ వ్యాధులు ఉన్న వారితో కంపెనీలు ఎలా వ్యవహరిస్తున్నాయనే విషయం ప్రజలకు తెలియజేయాలని, ఆరోగ్యంగా ఉన్న వారికే కాకుండా వ్యాధి సంక్రమించిన వారికి నిబంధనలు ఎలా ఉంటాయో తప్పక తెలియాలని వివరించింది. ఈ నిబంధనలను జీవిత బీమా, ఆరోగ్య బీమా కంపెనీలన్నీ అక్టోబర్ 1 నుంచి తప్పనిసరిగా పాటించాలని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది. 2017 నాటి మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం, హెచ్ఐవీ నివారణ నియంత్రణ చట్టం ఆధారంగా ఉన్న నిబంధనలను పాటించాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed