విక్రయానికి ఐఆర్‌డీఏఐ అనుమతి తప్పనిసరి!

by Harish |
విక్రయానికి ఐఆర్‌డీఏఐ అనుమతి తప్పనిసరి!
X

దిశ, వెబ్‌డెస్క్: లిస్టెడ్ బీమా కంపెనీల్లో 5 శాతం కంటే ఎక్కువ వాటా విక్రయించాలన్నా, కొనుగోలు చేయాలన్నా ప్రమోటర్లు ముందుగా అనుమతి తీసుకోవాలని బీమా రెగ్యులేటరీ తెలిపింది. భవిష్యత్తులో లిస్టెడ్ బీమా సంస్థలో పెట్టుబడిదారుల వాటాను 5 శాతానికి పెంచే అవకాశం ఉన్నప్పటికీ ఇండస్ట్రీ బాడీకి సమాచారం ఇవ్వాలని బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) పేర్కొంది. ఏ కంపెనీ అయినా ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని, అలాగే 1 శాతం నుంచి 5 శాతం లోపు వాటా కొనుగోలు, విక్రయానికి కూడా ‘ఫిట్ అండ్ ప్రాపర్’ నిబంధనలు ఉంటాయని ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. ఇండస్ట్రీ బాడీ ద్వారా ముందుగా అనుమతులను తీసుకోకుండా లావాదేవీలు నిర్వహిస్తే బీమా కంపెనీ జరిపే ఎలాంటి సమావేశాల్లో ఓటింగ్ హక్కులు బదిలీదారుకు ఉండదని, అంతేకాకుండా బదిలీ చేసినవారు అదనంగా షేర్లకు సంబంధించిన అన్ని వివరాలను తెలియజేయాల్సిన అవసరం ఉంటుందని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది. నిర్దేశించిన పరిమితికి మించి షేర్ల బదిలీ చేస్తే నియంత్రణ, చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని ఐఆర్‌డీఏఐ ఆదేశాలను జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed