అమీర్ ఖాన్ కూతురిపై ట్రోలింగ్.. ఆ ముసలోడిని పెళ్లి చేసుకోవద్దంటూ రిక్వెస్ట్!

by Shyam |
అమీర్ ఖాన్ కూతురిపై ట్రోలింగ్.. ఆ ముసలోడిని పెళ్లి చేసుకోవద్దంటూ రిక్వెస్ట్!
X

దిశ, సినిమా: అమీర్ ఖాన్ కుమార్తె ఐరా‌ఖాన్, తన ప్రియుడు నుపూర్ శిఖరేతో యూరప్‌ ట్రిప్‌లో ఉంది. అక్కడే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్న ఐరా.. నుపూర్‌తో ముద్దుల్లో మునిగితేలుతున్న పిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. నుపూర్ బుగ్గపై రొమాంటిక్‌గా కిస్ చేస్తున్న ఫొటోకు ‘మెర్రీ క్రిస్మస్ పార్ట్ 1. స్టోరీలో బ్లూపర్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ పిక్స్‌కు నుపూర్ లవ్ అండ్ హార్ట్ ఎమోజీస్‌తో రిప్లై ఇవ్వగా, నెటిజన్లు మాత్రం అతడిపై జోకులు పేల్చుతున్నారు. ‘ఐరా.. ఆ అంకుల్ పెద్ద జోకర్‌లా ఉన్నాడు. ముసలోడిని పెళ్లి చేసుకుంటావా ఏంటి? అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఐరా తమ ప్రేమ బంధాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

Advertisement

Next Story