- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టేడియంలో ప్రేక్షకులను టీజ్ చేసిన రవీంద్ర జడేజా..
దిశ, వెబ్‌డెస్క్: కేవలం చెన్నై జట్టుకు మాత్రమే కాకుండా ఎంఎస్ ధోనీకి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ మాజీ భారత కెప్టెన్ చెన్నై ని తన సెకండ్ హోమ్ లా మార్చుకున్నారు. 42 ఏళ్ల వయసులో సైతం ధోనీ బ్యాటింగ్ కు వస్తే స్టేడియాలు దద్దరిల్లిపోతున్నాయి. తమ సొంత జట్టు బ్యాటర్లు ఔట్ అయిన తర్వాత కూడా ధోనీ బ్యాటింగ్‌కు వస్తాడని చెన్నై అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారంటే ధోనీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, ధోనీ ఈ సీజన్‌లో 7 లేదా 8 వ స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్న విషయం తెలిసిందే. అయితే కోల్‌కతా మ్యాచ్‌లో ధోనీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రుతు రాజ్ గైక్వాడ్ 67 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి సీఎస్కేకు గెలుపును ఈజీ చేశాడు. అయితే శివమ్ దూబే ఔట్ అయిన అనంతరం ధోని బ్యాటింగ్ వచ్చాడు. ఈ సందర్భంగా దోనీకి బదులు డగౌట్ నుంచి ప్యాడ్‌లు కట్టుకుని రవీంద్ర జడేజా బయటకు వచ్చి ప్రేక్షకులను టీజ్ చేశాడు. అనంతరం ఇది చూసిన ఫ్యాన్స్ కేకలు వేయడంతో వెంటనే వెనుదిరిగి వెళ్లిపోయాడు. అనంతరం తలా బ్యాటింగ్‌కు వచ్చాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ధోనీ వస్తున్న సమయంలో రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలోని హుకుం సాంగ్ ప్లే చేయడంతో ప్రేక్షకుల ఉత్సాహం రెట్టింపు అయింది.