IPL 2023: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్..

by Vinod kumar |   ( Updated:2023-05-08 13:49:24.0  )
IPL 2023: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందడుగు వేయడానికి ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకు వేసినట్లే. పంజాబ్ జట్టు తన చివరి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పటి వరకు ఈ టీం ఆడిన 10 మ్యాచుల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుతుంది. ఈ క్రమంలో ఎలాగైనా గెలవాలని పంజాబ్ పట్టుదలగా ఉంది.

అదే సమయంలో చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై నెగ్గిన కోల్‌కతా కూడా ప్లేఆఫ్స్ రేసులో ముందడుగు వేయాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. అలాగే ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ కూడా చాలా కీలకం కానుంది. ఇక్కడ ఈ సీజన్‌లో జరిగిన నాలుగు మ్యాచుల్లో మూడింట మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఇది పూర్తి బ్యాటింగ్ పిచ్. ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్లు మూడుసార్లు 200 పైగా పరుగులు చేశాయి. ఈ సీజన్‌లో ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 211 కావడం గమనార్హం.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

రహ్మానుల్లా గుర్బాజ్(w), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చకరవర్తి

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(సి), భానుకా రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

Advertisement

Next Story