- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: ల్యాండ్ మార్క్ మ్యాచ్‌ను ఆడబోతున్న ధోనీ సేన..
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు కూడా రెండు విజయాలతో సమవుజ్జీగా నిలిచాయి. నెట్ రన్‌రేట్ ఆధారంగా రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. సీఎస్‌కే అయిదో స్థానంలో కొనసాగుతోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది 200 మ్యాచ్. ధోనీ సారథ్యంలో తన ల్యాండ్ మార్క్ మ్యాచ్‌ను ఆడబోతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ధోనీ కెప్టెన్సీలో సీఎస్‌కే.. తిరుగులేని జట్టుగా.. ఐపీఎల్‌లో సెకెండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ఇదే. ముంబై ఇండియన్స్ తరువాత అత్యధికంగా ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.
ఇప్పటివరకు నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్ ఖాతాలో అయిదు టైటిల్స్ ఉన్నాయి. అయిదు సార్లు ఫైనల్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2008, 2009, 2018, 2021లో ఐపీఎల్ కప్‌ను ఎగరేసుకెళ్లింది ధోనీ ఆర్మీ. ఈ సారి ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లల్లో రెండింట్లో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది గానీ.. ఆ తరువాత పుంజుకొంది. ఓటమి భారం నుంచి త్వరగా కోలుకుంది. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.
ధోని కెప్టెన్‌గా 200 వ మ్యాచ్ ఆడుతున్న వేళ సీఎస్కే ట్విటర్ ఖాతాలో 2008 నుంచి ధోనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ‘ఓ కెప్టెన్.. అవర్ కెప్టెన్’ అని ఆ ఫోటోలకు కామెంట్ చేసింది. అలాగే ట్విటర్‌లో #Thala200 కూడా ట్రెండింగ్‌లో ఉంది. కెప్టెన్‌గా 200వ మ్యాచ్‌లో ధోనికి అపురూప విజయాన్ని అందించేందుకు చెన్నై చిన్నోళ్లు సిద్ధమయ్యారు.