- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: మరో ఆసక్తికర పోరు.. ఢిల్లీతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీ
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఢిల్లీలోని అరున్ జైట్లి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ మధ్య మరో ఆసక్తికర పోరు జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు వరుస పరాజయాల తర్వాత విజయం కోసం చూస్తోంది. ఈ సీజన్‌లో నితీష్ రాణా సేన పర్వాలేదనిపించింది. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ బౌలింగ్‌లో బలహీనంగా కనిపిస్తోంది. మరో వైపు ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌లో వార్నర్ ఒక్కడే రాణిస్తున్నాడు. మినహా మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడంతో అతను కూడా నిదానంగా బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా టాపార్డర్ చేతులెత్తేయడం జట్టుకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నది. ఓపెనర్ పృథ్వీషా దారుణంగా నిరాశపరుస్తుండటంతో జట్టుకు శుభారంభం కరువైంది.
మనీశ్ పాండే, మిచెల్ మార్ష్, యష్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, రోమన్ పొవెల్, రిలీ రొసోవ్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పొరెల్.. ఇలా మిడిలార్డర్‌లో బ్యాటర్లను మారుస్తున్నా ప్రయోజనం మాత్రం లేదు. వార్నర్ తర్వాత అక్షర్ పటేల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వార్నర్, అక్షర్‌కు తోడు మిగతా బ్యాటర్లు మెరుగ్గా రాణిస్తేనే ఈ సీజన్‌లో ఢిల్లీ భవితవ్యం ఆధారపడి ఉన్నది. ఈ వేదికపై మునుపటి మ్యాచ్ స్లో బౌలర్లకు గణనీయమైన సహకారం అందించింది. ఢిల్లీలో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు(అంచనా):
డేవిడ్ వార్నర్ (సి), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, మనీష్ పాండే, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (వికెట్), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్
కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు(అంచనా):
రహ్మానుల్లా గుర్బాజ్ (wk), N జగదీసన్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి