IPL 2023 Final: ఫైనల్ ఫైట్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్..

by Vinod kumar |   ( Updated:2023-05-30 11:59:17.0  )
IPL 2023 Final: ఫైనల్ ఫైట్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరగాల్సిన IPL 2023 Final మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. ఫైనల్ పోరులో టాస్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. చెపాక్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయర్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ రెండు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ధోనీ తెలివైన వ్యూహాల ముందు గుజరాత్ తేలిపోయింది. అయితే ఈసారి సొంత మైదానంలో ఎలాగైనా గెలిచి, తమ టైటిల్ కాపాడుకోవాలని గుజరాత్ అనుకుంటోంది. దానికితోడు హోమ్ గ్రౌండ్‌లో గిల్ ఫామ్‌ కూడా వారికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటికే రెండుసార్లు ఎదురుపడ్డాయి. ఈ సీజన్ తొలి మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే జరిగిన విషయం తెలిసిందే.

మళ్లీ ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌లో తారసపడ్డాయి. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ అది. ఆ మ్యాచ్ రిజల్ట్ రివర్స్ అయింది. ఈ సారి గుజరాత్ టైటాన్స్‌పై ధోనీ సేన తిరుగులేని విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 172 పరుగులు చేయగా.. హార్దిక్ టీమ్ దాన్ని ఛేదించలేకపోయింది 157 పరుగులే చేయగలిగింది. ముచ్చటగా మూడోసారి ఫైనల్స్‌లో కూడా ఈ రెండు జట్లే పోరాడబోతోండటం ఆసక్తి రేపుతోంది. డిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్, ప‌దోసారి ఫైన‌ల్ చేరిన చెన్నై సూప‌ర్ కింగ్స్ టైటిల్ పోరులో ఢీ కొంటున్నాయి. అహ్మదాబాద్ స్టేడియం వేదిక‌గా ఇరుజ‌ట్లు హోరాహోరీగా త‌ల‌ప‌డ‌నున్నాయి. దాంతో పాండ్యా సేన‌ రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందా..? లేదా చెన్నై ఐదోసారి క‌ప్పును ఎగ‌రేసుకుపోతుందా..? అనే ఆస‌క్తి రేపుతోంది.

రికార్డులు చూస్తే.. చెన్నైదే విజయం..

2011 నుంచి జరిగిన 12 ఫైనల్స్‌లో 9 మ్యాచ్‌లు, క్వాలిఫైయర్ 1లో గెలిచిన జట్టే ఫైనల్‌లోనూ విజయం సాధించింది. అంటే ఇప్పుడు కూడా అదే నిజమైతే.. చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుంది.

రిజర్వ్ డే నియమాలు..

ఈ రోజు మళ్లీ వర్షం పడితే ఏమవుతుందో తెలుసా..?

రాత్రి 9:35 గంటలకు మ్యాచ్ ప్రారంభమైనా, పూర్తి 20 ఓవర్ల ఆట ఉంటుంది. 9:35 తర్వాత మ్యాచ్ ప్రారంభమైతే ఓవర్లు తగ్గుతాయి. మ్యాచ్ 9:45కి ప్రారంభమైనప్పుడు 19 ఓవర్లు, 10కి 17 ఓవర్లు, 10:30కి ప్రారంభమయ్యే సరికి 15-15 ఓవర్లు ఉంటాయి. కట్-ఆఫ్ సమయం ఉదయం 12:06 వరకు ఉంటుంది. అప్పటి వరకు 5-5 ఓవర్ల ఆట ప్రారంభం కాకపోతే, అప్పుడు మ్యాచ్ రద్దు చేయబడుతుంది.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(c), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని(w/c), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

Advertisement

Next Story

Most Viewed