చెన్నయ్‌కు భారీ షాక్.. స్వదేశానికి తిరిగి వెళ్లిన పతిరన

by Harish |   ( Updated:2024-05-05 13:28:23.0  )
చెన్నయ్‌కు భారీ షాక్.. స్వదేశానికి తిరిగి వెళ్లిన పతిరన
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్-17లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్‌ను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే పేసర్ దీపక్ చాహర్ గాయపడి జట్టుకు దూరమవ్వగా.. ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. సీఎస్కే సంచలనం, శ్రీలంక బౌలర్ మతీశా పతిరన తొడకండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో పంజాబ్‌తో వరుస మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు. అంతేకాకుండా, గాయం నుంచి కోలుకునేందుకు అతను తిరిగి శ్రీలంకకు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని చెన్నయ్ మేనేజ్‌మెంట్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, అతను తిరిగి రావడంపై స్పష్టతనివ్వలేదు. మిగతా సీజన్‌కు పతిరన దూరమైనట్టు తెలుస్తోంది. ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన అతను 13 వికెట్లతో సత్తాచాటాడు. దీపక్ చాహర్ కూడా మిగతా టోర్నీ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా పతిరన కూడా గాయపడి స్వదేశానికి వెళ్లడం చెన్నయ్‌కు భారీ ఎదురుదెబ్బే.

Advertisement

Next Story