10 రోజులుగా నా తండ్రి ICUలో ఉన్నాడు.. అతని కోసమే నేను ఆ గేమ్ ఆడుతున్నాను: Mohsin Khan

by Mahesh |   ( Updated:2023-05-17 05:51:24.0  )
10 రోజులుగా నా తండ్రి ICUలో ఉన్నాడు.. అతని కోసమే నేను ఆ గేమ్ ఆడుతున్నాను: Mohsin Khan
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై ఇండియన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ ఆర్కిటెక్ట్ ఐదు పరుగులతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో లక్నో సూపర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే లాస్ట్ ఓవర్ లో 11 పరుగులను కాపాడిన మొహ్సిన్ ఖాన్ విషాద గాధ తెలిస్తే కన్నీరు పెట్టాల్సిందే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతను గత సీజన్‌లో మంచి ఫామ్ తో రాణించాడు. కానీ.. ఎడమ భుజం కారణంగా దేశీయంగా జరిగే అన్ని టోర్నమెంట్‌కి దూరం అయ్యాడు. అలాగే.. ఈ సీజన్ ఐపీఎల్‌లోను మొదటి మ్యాచులకు దూరం అయ్యాడు. దీనికి తోడు అతని తండ్రి తీవ్ర అనారోగ్యంతో గత 10 రోజులుగా ICU లో చికిత్స పొందుతున్నాడు.

ఇంతటి భాదను మనసులో పెట్టుకుని కూడా మొహ్సిన్ నిలకడగా రాణిస్తూ తన జట్టుకు విజయం సాధించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. "నేను గాయపడినందున ఇది చాలా కష్టమైన సమయం, ఒక సంవత్సరం తర్వాత ఆడుతున్నాను. మా నాన్న నిన్న ICU నుండి డిశ్చార్జ్ అయ్యారు. అతను గత 10 రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారు. నేను నా తండ్రి కోసమే ఈ గేమ్ ఆడుతున్నాను.. అతను చూస్తూ ఉండేవాడు" అని అతను చెప్పాడు. అలాగే.. "గత గేమ్‌లో నేను బాగా రాణించనప్పటికీ నన్ను ఈ ఆట ఆడించినందుకు జట్టుకు, సహాయక సిబ్బందికి, గౌతమ్ (గంభీర్) సార్, విజయ్ (దహియా) సర్‌లకు కృతజ్ఞతలు అని మొహ్సిన్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed