- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్.. జట్టులో నో చేంజేస్
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌లో ఆఖరి పోరుకు సమయం ఆసన్నమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ కోసం తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో ఫైనల్ పోరు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు టాస్ గెలిచింది. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకుని.. కేకేఆర్‌ను మొదట బౌలింగ్‌కు ఆహ్వానించాడు. ఎస్ఆర్‌హెచ్ మొదట బ్యాటింగ్ చేస్తుండటంతో భారీ స్కోర్ నమోదు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బలాబలాల పరంగా ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తుండటంతో ఏ జట్టు గెలుస్తుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు చెరో రెండు టైటిల్స్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్.. ముచ్చటగా మూడో టైటిల్‌పై కన్నేశాయి. మరీ 2024 ఐపీఎల్ సీజన్ విజేత ఎవరో తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.
జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(w), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(సి), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్ (w), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (సి), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి