- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉప్పల్ స్టేడియంలో భీకర వర్షం.. రేపటి మ్యాచ్ జరిగేనా..?
దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు హైదరాబాద్ మహానగరంలో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలీవో వర్షం కురవగా నగరంలో వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఐపీఎల్ 2024 లో భాగంగా మ్యాచులు జరుగుతున్న ఉప్పల్ స్టేడియంలో కూడా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు భారీ వర్షం కురిసింది. దీంతో అప్రమత్తమైన ఉప్పల్ గ్రౌండ్ సిబ్బంది వెంటనే మైదానాన్ని కవర్లతో కప్పివేశారు. అయినప్పటికి భారీ గాలుల కారణంగా గ్రౌండ్ మొత్తం అతలాకుతలం అయింది. దీంతో రేపు లక్నో, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుండగా.. తాజా పరిణామాలతో మ్యాచ్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాగా ఇరు జట్లు ప్లే ఆఫ్ చేరుకోవడానికి ఈ మ్యాచ్ అత్యంత ముఖ్యం కావడంతో నిర్వాహణ సాద్యం కాకుంటే చెరో పాయింట్ రానుంది. ఇలా జరిగితే ప్లే ఆఫ్ పై ఆశలు పెట్టుకున్న ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్ ఆశలపై నీరు చల్లినట్లైతుందిని విశ్లేషకు చెబుతున్నారు.