IPL2024: సొంత గడ్డపై గుజరాత్‌ను మట్టి కరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్

by GSrikanth |   ( Updated:2024-04-17 16:52:45.0  )
IPL2024: సొంత గడ్డపై గుజరాత్‌ను మట్టి కరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్2024లో భాగంగా గుజరాత్‌ నరేంద్ర మోడీ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై గుజరాత్‌ను మట్టి కరిపించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ బ్యాటర్లంతా విఫలం అయ్యారు. కెప్టె్న్ గిల్(8), సాహా(2), సుదర్శన్(12), మిల్లర్(2), తెవాటియా(10) ఇలా అందరూ విఫలం కాగా, రషీద్ ఖాన్(31) ఒక్కడే గౌరవప్రదమైన స్కోరు చేశాడు. మొత్తంగా గుజరాత్ 17.3 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి కేవలం 89 పరుగులే చేసింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాటర్లు కూడా మొదట తడబడ్డారు. 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయంది. చివరకు కెప్టెన్ రిషబ్ పంత్(16), షై హోప్(19) పరుగులు చేసి జట్టును గెలిపించారు. మొత్తంగా 8.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. ఆరు వికెట్ల తేడాతో గుజరాత్‌పై ఘన విజయం సాధించింది.

Advertisement

Next Story