- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్.. జట్టు ఇదే
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా కీలకమైన ప్లే ఆఫ్ రేస్ మ్యాచులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. తమిళనాడులోని చపాక్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ రెండు జట్ల మధ్య ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించింది. దీనికి ఈ రోజు చెన్నై జట్లు ప్రతీకారం తీర్చుకొనేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు సన్ రైజర్స్ జట్టు గెలిచిన ప్రతి మ్యాచ్ మొదట బ్యాటింగ్ చేసిన మ్యాచులే. కాగా ఈ రోజు కూడా ఆ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి మరో భారీ స్కోర్ చేస్తుందని అందరూ బావించారు. కానీ కెప్టెప్ ప్యాట్ కమ్మిన్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. అలాగే జట్టులోకి మరో బ్యాటర్ అవసరం ఉండటంతో మయాంక్ మార్కండే స్థానంలో.. యువ ప్లేయర్ ను తీసుకున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (సి), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (w), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్(w), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(c), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, T నటరాజన్