బౌలింగ్‌తో బెంబేలెత్తించారు

by Shiva |
బౌలింగ్‌తో బెంబేలెత్తించారు
X

దిశ, స్పోర్ట్స్: టెస్ట్, వన్డే క్రికెట్‌లో బౌలర్లు ఏ క్షణమైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. బ్యాట్స్‌మాన్ ఆధిపత్యం చెలాయించే క్రికెట్‌లో బౌలర్లు ఏమైనా చేయాలంటే టెస్టు, వన్డే ఫార్మాట్ లోనే చేయగలరు. ఇక టీ20 వంటి ధనాధన్ క్రికెట్ వచ్చిన తర్వాత బౌలర్లకు ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా? క్రికెట్ బుక్‌ను మించిన షాట్లు కొట్టే బ్యాట్స్‌మెన్‌కు ఏ బౌలర్ అయినా ఎలాంటి బౌలింగ్ వేయగలరు? మరీ ముఖ్యంగా ఐపీఎల్ వంటి క్యాష్ రిచ్ లీగ్స్‌లో బ్యాట్స్‌మెన్ బీభత్సంగా రెచ్చిపోతుంటే.. వాళ్లను ఆపే బౌలర్లు ఉంటారా ? అంటే మేమున్నాము అంటూ గత సీజన్‌లో కొంత మంది నిరూపించుకున్నారు. కీలక సమయంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పరుగలను కట్టడి చేస్తూ విజయాలు అందించి మ్యాచ్ విన్నర్లుగా నిలబడ్డారు. అలాంటి బౌలర్లలో వీరే టాప్

పర్పుల్ క్యాప్..

దక్షిణాఫ్రికాకు చెందిన కసోగి రబాడ ఐపీఎల్ 13వ సీజన్‌లో బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన రబాడ.. ప్రత్యర్థుల వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ గత సీజన్‌లో ఫైనల్ వరకు చేరడంలో బ్యాట్స్‌మెన్ ఎంత పాత్ర పోషించాలో అంతకంటే ఎక్కువగా రబాడ కష్టపడ్డాడు. ఐపీఎల్ 13వ సీజన్‌లో 17 మ్యాచ్‌లు ఆడి 8.34 ఎకానమీతో మొత్తం 30 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. గత సీజన్‌లో 4/24 రబాడ అత్యుత్తమ ప్రదర్శన

యార్కర్ వీరుడు బుమ్రా..

టీమ్ ఇండియాలో కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ముంబయి ఇండియన్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. గత సీజన్‌లో కేవలం 15 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 6.73 ఎకానమీతో 27 వికెట్లు తీశాడు. కీలక సమయంలో యార్కల్లు వేస్తూ ప్రత్యర్థి జట్టు వికెట్లు తీశాడు. అదే సమయంలో ముంబయి పేసర్ ట్రెంట్ బౌల్ట్ కూడా 25 వికెట్లు తీయడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ఎన్రిచ్ నోర్జే 16 మ్యాచ్‌లలో 22 వికెట్లు తీయడం గమనార్హం

రషీద్ ఖాన్.. బెస్ట్ ఎకానమీ

సన్ రైజర్స్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ ఐపీఎల్ 13వ సీజన్‌లో కీలక పాత్ర పోషించాడు. సన్ రైజర్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో రషీద్ మిస్టరీ స్పిన్ ఒక కారణం. రషీద్ 16 మ్యాచ్‌లు ఆడి 5.37 సగటుతో 20 వికెట్లు తీశాడు. గత సీజన్‌లో అత్యుత్తమ ఎకానమీ సాధించిన బౌలర్ రషీద్ ఖాన్ కావడం గమనార్హం.

ఐపీఎల్ 13వ సీజన్ టాప్ బౌలర్స్

1. కసోగి రబాడ 17 మ్యాచ్‌లు – 30 వికెట్లు – బెస్ట్ 4/24 – 8.34 ఎకానమీ
2. జస్ప్రీత్ బుమ్రా – 15 – 27 – 4/14 – 6.73
3. ట్రెంట్ బౌల్డ్ – 15 – 25 – 4/18 – 7.97
4. ఎన్రిక్ నోర్జే – 16 – 22 – 3/33 – 8.39
5. యజువేంద్ర చాహల్ – 15 – 21 – 3/18 – 7.08

Advertisement

Next Story