- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీఎల్ వేలంలో శ్రీశాంత్.. రేట్ ఎంతో తెలుసా?
ముంబయి: స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కేసులో ఏడేళ్ల నిషేధకాలాన్ని పూర్తిచేసుకున్న టీమ్ ఇండియా ఆటగాడు శ్రీశాంత్, ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే దేశవాళీ క్రికెట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ తరఫున ఆడిన ఈ పేస్ బౌలర్, నాలుగు వికెట్లు తీశాడు. అయితే, ఐపీఎల్ మినీ వేలం ఈ నెల 18న చెన్నైలో జరగుతుండటంతో, ఇందులో పాల్గొనే ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం(ఈ నెల 3)తో ముగిసింది. మొత్తం 1,097 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమదుచేసుకోగా, ఇందులో శ్రీశాంత్ కూడా ఉన్నాడు. అయితే, వేలంలో తన కనీస ధరను రూ.75 లక్షలుగా శ్రీశాంత్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వేలంలో మొత్తం 61 మంది ఆటగాళ్లను మాత్రమే ఫ్రాంచైజీలు దక్కించుకోనుండగా, ఇందులో 22మంది విదేశీ ప్లేయర్స్‌నే తీసుకునే అవకాశముంది. మరి అంతమంది ప్లేయర్స్ ఉండగా, ఫ్రాంచైజీలు శ్రీశాంత్‌ను తీసుకుంటాయో లేదో చూడాలి. మరోవైపు హర్భజన్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, కేదర్ జాధవ్, స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, జెసన్ రాయ్‌లు తమ కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. మార్నస్ లబుషేన్, హనుమ విహారి, ఉమేశ్ యాదవ్ రూ.కోటి చొప్పున ధర నిర్ణయించి, వేలంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.
పుజారా ధర రూ.50 లక్షలు
ఇండియన్ టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఈ వేలంలో తన కనీస ధరను రూ.50లక్షలుగా ఫిక్స్ చేసుకున్నాడు. గత ఏడాది పుజారాను ఎవరూ కొనలేదు. కనీసం ఈసారైనా ఐపీఎల్‌లో ఆడాలనే ఆశతో ఉన్నాడు. ఇదిలా ఉండగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ సైతం ఈ వేలంలో పాల్గొననున్నాడు. కనీస ధరను రూ.20 లక్షలుగా నిర్ణయించుకున్నాడు.