- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నేను ఊహించిందే జరుగుతుంది’
దిశ, స్పోర్ట్స్: క్రికెట్‌లో చాలా సార్లు తాను ఊహించినవే జరిగాయని, అందులో తన రెండో హ్యాట్రిక్ ఒకటని టీం ఇండియా చైనామన్ స్పిన్నర్ కుల్డీప్ యాదవ్ అన్నాడు. వన్డే మ్యాచ్‌ల్లో భారత్ నుంచి రెండు సార్లు హ్యాట్రిక్ సాధించిన ఒకే ఒక బౌలర్ కుల్దీప్ యాదవ్ మాత్రమే. తొలి హ్యాట్రిక్ 2017లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో తీయగా, తిరిగి రెండేళ్ల తర్వాత వెస్టిండీస్‌పై తన మ్యాజిక్ రిపీట్ చేశాడు.
ఈ క్రమంలో తన రెండో హ్యాట్రిక్‌పై కుల్దీప్ స్పందిస్తూ.. ‘మీరు నమ్మకపోవచ్చు గానీ, నేను రెండోసారి హ్యాట్రిక్ వికెట్లు తీయబోతున్నట్టు మా అమ్మకు ముందే చెప్పాను’ అని వెల్లడించాడు. ‘ఇలాంటివే నా విషయంలో చాలా సార్లు జరిగాయి. ఇలా నేను ఊహించినవి జరగడం ఓ యాధృచ్ఛికంగా అనిపిస్తుంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా, ఐపీఎల్ (IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున ఆడుతున్న కుల్దీప్, సరైన భాగస్వామ్యాలతో ఆడితే కేకేఆర్ టైటిల్ నెగ్గగలదని దీమా వ్యక్తం చేశాడు.