- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీఎల్ షెడ్యూల్ ఆలస్యానికి కారణమేంటి?
దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 13వ సీజన్(13th season) సెప్టెంబర్ 19నుంచి నవంబర్ 10వరకు యూఏఈ నిర్వహించనున్నారు. బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్(BCCI, IPL Governing Council) ఈ నిర్ణయం తీసుకొని వారంరోజులు కావొస్తున్నా ఇంకా పూర్తి స్థాయి షెడ్యూల్(Schedule) విడుదల చేయలేదు. భారత ప్రభుత్వం(Government of India) అనుమతులు జారీ చేసిన అనంతరం అన్ని ఫ్రాంచైజీ(Franchisee)లకూ గవర్నింగ్ కౌన్సిల్స్ సమగ్ర విధివిధానాలు (sop) డ్రాఫ్ట్‌ను కూడా అందించింది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు యూఏఈ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
53రోజుల పాటు ఐపీఎల్ (IPL) నిర్వహిస్తామని చెప్పిన బీసీసీఐ (BCCI) ఇప్పటివరకు షెడ్యూల్(Schedule) ప్రకటించకటించలేదు. అయితే, యూఏఈ ప్రభుత్వం(Government of the UAE) నుంచి ఇంకా పూర్తి స్థాయి అనుమతులు రాలేదని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో అనుమతులు మంజూరు కాగానే షెడ్యూల్ ప్రకటిస్తారని అందుకే కాస్త ఆలస్యం అవుతున్నట్లు బోర్డు సభ్యులు(Board members) ఒకరు చెప్పారు.
మరోవైపు స్టేడియాల(Stadiums) విషయంలో కూడా బీసీసీఐ (BCCI) మల్లగుల్లాలు పడుతున్నది. యూఏఈలో ఐదు అంతర్జాతీయ స్టేడియాలు(Five international stadiums) అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటన్నింటిలో బయోబబుల్ (Bio Bubble) ఏర్పాటు చేయడం కష్టమైన పని కావడంతో, రెండింటికే ఐపీఎల్ పరిమితం చేయాలని మొదటి నుంచి భావించింది. అబుదాబి, దుబాయ్, షార్జాల్లో(Abu Dhabi, Dubai, Sharjah) క్రికెట్ స్టేడియాలు ఉండగా, దుబాయ్, షార్జా సమీపంగా ఉన్నాయి. అబుదాబి మాత్రం కొంచెం దూరంలో ఉంది. దీంతో రెండు నగరాలకే పరిమితం చేయాలని అనుకుంటున్నది. మరోవైపు ఒకే స్టేడియంలో ఐపీఎల్ మొత్తం నిర్వహిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతున్నది.