ఈ అవకాశం మిస్ చేసుకోవొద్దు.. సెలెక్ట్ అయితే మీకు రూ. 4 లక్షలొస్తాయి

by Sridhar Babu |   ( Updated:2021-11-09 07:37:24.0  )
4-lACKS1
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జాతీయ యువజన అవార్డు 2019-20 సంవత్సరానికి గాను హైదరాబాద్ జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడా శాఖ ప్రకటించింది. ఈ మేరకు జిల్లా యువజన, క్రీడా అధికారి ఎన్ సుధాకర్ రావు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హైదరాబాద్ జిల్లాకు చెందినవారై ఉండాలని, 15 -29 సంవత్సరాల మధ్య వయస్సువారు మాత్రమే అర్హులని తెలిపారు. ఆరోగ్యం, పరిశోధన, ఆవిష్కరణ, సంస్కృతి, మానవ హక్కుల ప్రచారం, కళలు, సాహిత్యం, పర్యాటకం, సాంప్రదాయక వైద్యం, క్రియాశీల పౌరసత్వం, సంఘ సేవ, క్రీడలు, అకాడమిక్ ఎక్సలెన్స్, స్మార్ట్ లెర్నింగ్ తదతర రంగాలలో వారు చేసిన గుర్తింపునకు అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు.

గతంలో అవార్డు పొందనివారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఎంపిక చేసినవారికి మెడల్, సర్టిఫికెట్ తో పాటు రూ. లక్ష నగదు బహుకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా నియమ నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపిక చేసిన సంస్థలకు రూ. 3 లక్షల నగదు బహుకరిస్తామని చెప్పారు. ఆసక్తి గల వ్యక్తులు, సంస్థలు తమ దరఖాస్తులను ఈ నెల 19వ తేదీలోగా ఆన్ లైన్ https://innovate.mygov.in/national-youth-award-2020/

నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

బాయ్ ఫ్రెండ్ గుడ్డివాడైతే ఇన్ని లాభాలా?.. వీడియో వైరల్

Advertisement

Next Story

Most Viewed