- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
97 శాతం పెరిగిన అగ్రి, ఫుడ్ స్టార్టప్‌ల పెట్టుబడులు!
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని నెలలుగా వ్యవసాయం, ఆహార సంబంధిత స్టార్టప్‌లలో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ఈ స్టార్టప్‌లలో 97 శాతం పెరిగి రూ. 15,750 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రముఖ వెంచర్ కేపిటల్ కంపెనీలు ఓమ్నివోర్, ఏజీ ఫండర్ సంయుక్త నివేదిక స్పష్టం చేసింది. ప్రధానంగా రెస్టారెంట్ల విభాగంలో ఈ నిధులు అధికంగా ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో అగ్రి, ఫుడ్ స్టార్టప్‌లు మొత్తం 136 ఒప్పందాలు పూర్తిచేయగా, 2020-21లో ఇవి 189కి పెరిగాయి. రెస్టారెంట్ మార్కెట్‌ప్లేస్ స్టార్టప్‌లు మొత్తం రూ. 10 వేల కోట్లతో మొత్తం పెట్టుబడుల్లో 64 శాతం వాటా దక్కించుకున్నాయి. ఇక, ఈ-గ్రాసరీ, ప్రీమియం బ్రాండెడ్ ఫుడ్ లాంటి స్టార్టప్‌లు అంతకుముందు కంటే 140 శాతం ఎక్కువగా రూ. 13.4 వేల కోట్ల పెట్టుబడులను సాధించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారీ సబ్‌స్క్రైబ్‌తో ఐపీఓకు వచ్చిన జొమాటోతో ఈ విభాగాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారని నివేదిక తెలిపింది. పెట్టుబడిదారులు ముఖ్యంగా రైతులు, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులకు మరింత ఎక్కువ విలువను పెంచుతూ మద్దతిస్తున్నారని నివేదిక వెల్లడించింది.