అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించండి: నాదెండ్ల మనోహర్

by srinivas |
అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించండి: నాదెండ్ల మనోహర్
X

దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ కుంభకోణంతో పాటు ఇంత వరకు చోటుచేసుకున్న అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలతో టీడీపీ నేత అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసేటప్పుడు రాజ్యాంగ నిబంధనలు పాటించాల్సిందని, అసలు ఆయనను అవినీతికి పాల్పడినందుకు అరెస్ట్ చేశారా? లేక కక్ష సాధింపుకు పాల్పడ్డారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. జనసేన అవినీతిని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మనోహర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed