షార్క్ చేపతో అజయ్ దేవగన్ ఫైట్.. మరో రేంజ్‌లో ‘ఇన్‌ టు ది వైల్డ్‌’ ప్రోమో

by Shyam |   ( Updated:18 Aug 2023 3:23 PM  )
షార్క్ చేపతో అజయ్ దేవగన్ ఫైట్.. మరో రేంజ్‌లో ‘ఇన్‌ టు ది వైల్డ్‌’ ప్రోమో
X

దిశ, సినిమా: డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయ్యే కార్యక్రమం ‘ఇన్‌ టు ది వైల్డ్‌’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అడవిలో సాహసాలు చేస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బేర్ గ్రిల్స్.. భారతీయ ప్రముఖులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్ కిలాడి అక్షయ్‌కుమార్‌‌లతో సాహస విన్యాసాలు చేసి ఔరా అనిపించారు. తాజాగా బేర్ గ్రిల్స్ బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్‌తోనూ మాల్దీవ్స్‌లో ఈ ప్రోగ్రామ్ చేయగా.. ఇందుకు సంబంధించిన ప్రోమోను డిస్కవరీ చానల్ విడుదల చేసింది.

అజయ్ హిందూ మహా సముద్రంలో సార్క్ చేపతో చేసిన సాహసాలు ఒక రేంజ్‌లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రోమోలో అజయ్ తన తండ్రి గురించి ఆసక్తిరమైన విషయాలు వెల్లడించాడు. ‘నాన్న చాలా కష్టపడి ఈ స్థాయికి తీసుకువచ్చారు. నాన్న ఉన్నప్పుడు ఆయన విలువ తెలియలేదు. ఇప్పుడు నాన్న లేని లోటు తెలుస్తుంది’ అంటూ తండ్రిని తలచుకుని అజయ్ కంటతడి పెట్టారు. అజయ్ దేవగన్ తండ్రి వీరు దేవగన్ 2019లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

Next Story