- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాజీపూర్‌లో కలెక్టర్ పల్లె నిద్ర
దిశ, నల్లగొండ: ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్యతో హాజీపూర్ గ్రామం తెలంగాణ ప్రజలకు సుపరిచితమైంది. అత్యాచారం, హత్య కేసులో మర్రి శ్రీనివాస్‌రెడ్డికి స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం విధితమే. ముగ్గురు బాలికలు హత్యకు గురికావడంతో భయాందోళనలో ఉన్న హజీపూర్ గ్రామస్తులకు భరోసా ఇచ్చేందుకు ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ గ్రామంలో బస చేశారు. గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గురువారం ఉదయం గ్రామంలోని పలు వెంట తిరిగారు. పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామంలో ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను సేకరించి నివేదిక రూపొందించారు. కమ్యూనిటీ సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. స్థానిక పోలీసుల సహకారంతో ఆడ పిల్లలకు ఎలాంటి కష్టం వచ్చినా వారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
tags : Interview, Hajipur villagers, yadadri, srinivas reddy, cc camera, rachakonda cp mahesh bhagavath,nalgonda