చిత్రంపై రుస్తుం ముచ్చట

by  |
చిత్రంపై రుస్తుం ముచ్చట
X

దిశ, సిద్దిపేట: భారతదేశం74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం ‘స్వతంత్ర భారత జాతీయ పతాకం’ క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘”స్వాతంత్ర్య పర్వం, భారతజాతికి గర్వం, ఆనందలే సర్వం” ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి దాస్య శృంఖలాలను పగులగొట్టి ఎందరో ప్రాణత్యాగదనుల పుణ్యఫలం మనం అనుభవించే స్వాతంత్ర్యం. స్వతంత్రం సిద్ధించి భారత జాతికి పెనుమార్పులు సంభవించినాయి. ఇంక మనమనుకున్న ఐకమత్యం, సహజీవనం, అభివృద్ధి లక్ష్యాలవైపు అధిగమించాల్సిన అవసరం ఎంతైనాఉంది. ముఖ్య మంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ లక్ష్యాలు రైతుబంధు, నీటిపారుదల ప్రాజెక్టులు శాంతిభద్రతలు ప్రజా సంక్షేమ పతకాలు భారతావనికి ప్రపంచ మానవాళికి మార్గదర్శకాలు. 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవం ఐకమత్యం సహజీవనం ప్రతి పౌరునికి రక్షణ, నిరుద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించాలి. అందరి జీవితాల్లో ఆనందాలు పంచాలి, కరోనా వైరస్ ను అధిగమించాలి. మాస్క్, భౌతిక దూరంతో అప్రమత్తంగా ఉండాలి. భారత జెండా పండుగను ప్రతిభారతీయుడు సగర్వాంగా జరుపుకోవాలి’ అని రుస్తుం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రూబినారుస్తుం, రహీం రిజ్వానాబేగం, ఆయేషా, మెహరాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed