- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిత్రమా.. మరువలేని ఓ బంధమా…
దిశ, వెబ్‌డెస్క్ : స్నేహా మేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా.. అని స్నేహం గురించి ఎన్ని పాటలు వచ్చిన ఎంత మంది కవులు స్నేహాన్ని పొగిడినా దాని గొప్పతనం వర్ణించలేనిది.. జీవితంలో అమ్మ నాన్న తర్వాత మనకు అంతే ప్రేమ స్నేహితుల నుంచి దొరుకుతుంది. మనం మన ఇంటిలో చెప్పుకోలేని ఎన్నో సమస్యలను, విషయాలను స్నేహితుల దగ్గర చెప్పుకుంటాము. అందుకే అంటారు స్నేహితుడు దేవుడిచ్చిన గొప్పవరం అని. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది.
మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం, అలాగే మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం. అని ఓ మహాకవి వర్ణించాడు.. అంటే ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోవడం చాలా కష్టం. కష్ట సమయంలో మనకు అండగా ఉండి, మనకు ధైర్యాన్ని చెప్పేవాడు స్నేహితుడు. మనం ఎదైనా తప్పుచేస్తున్నప్పుడు ముఖం మీదనే చెప్పి ఇది తప్పు.. ఇలా చేయకూడదు అని మంచి చెడులు చెప్పే మధురమైన బంధం స్నేహం. ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొండంత ధైర్యాన్ని, మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే నిజమైన స్నేహితుడు కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉంటాడు అంటారు.
స్నేహితుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు…
ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు… 919లో అమెరికాలో గ్రీటింగ్ కార్డ్స్ పరిశ్రమను నిర్వహించే ‘హాల్ మార్క్ కార్డ్స్’ అనే వ్యక్తి మనసులో రూపుదిద్దుకున్న ఆలోచనే స్నేహితుల దినోత్సవం. మొదట బొకే బాండ్స్ కట్టడంతో మొదలైంది. 1958 జూలై 20న పెరుగ్వే పట్టణంలో డాక్టర్ ఆర్టేమియా బ్రాకో స్నేహితులతో విందు సమయంలో ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ జూలై 30ని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు 1958 జూలై 30 నుంచి స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.
మధురమైన స్నేహానికి.. అందమైన కవిత
వెన్నెల్లో చంద్రుని వలే చల్లని బంధం స్నేహం
తీయని మమతకు మారు పేరు స్నేహం
కారు చీకట్లో చిరు దీపం స్నేహం
జీవితంలో మరువలేని తీయని జ్ఞాపకం స్నేహం….