- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
1,242మందికి ఇంటర్ మెమోలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షానికి వేలాది మంది ఆస్తులు ధ్వంసం కావడమే గాక, పలు ప్రాంతాల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు సైతం కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా సర్టిఫికెట్లను జారీ చేయాలని అక్టోబర్ 21న ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ బోర్డుకు డూప్లికేట్ మెమోల కోసం 1,255 దరఖాస్తులుగా 1,242 మందికి అందించారు. ఇంటర్ స్టడీ సర్టిఫికెట్ల కకోసం 138 మంది దరఖాస్తు చేసినట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఎస్‌ఎస్‌సీ మెమోలను 143మంది విద్యార్థులు కోరగా అందరికీ మెమోలను అందించారు. టెక్నికల్ ఎడ్యూకేషన్ బోర్డుకు ఎలాంటి దరఖాస్తులు అందలేదు. నష్టపోయిన విద్యార్థులు డూప్లికేట్ సర్టిఫికెట్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్ సూచించారు. విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ స్కూల్ ఎడ్యూకేషన్ ( 040-2330942), ఇంటర్మీడియట్ (040-4600110), కళాశాలలు (040-24745021), టెక్నికల్ ఎడ్యూకేషన్ (04023222192)లో ఆఫీస్ సమయాల్లో సంప్రదించాలని సూచించారు.