జూన్ తొలివారంలో ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పొరేషన్ల పరిధిలో జూన్​ 1 నుంచి 8 వరకు ‘ఇం​టెన్సివ్​ శానిటేషన్​ డ్రైవ్​’ నిర్వహించాలని మున్సిపల్​ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్​ కుమార్​ జిల్లాల్లోని అడిషనల్​ కలెక్టర్లు, మున్సిపల్​ కమిషనర్లను ఆదేశించారు. మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) డైరెక్టర్​ సత్యనారాయణతో కలిసి గురువారం అడిషనల్​ కలెక్టర్లు, మున్సిపల్​ కమిషనర్లు, మున్సిపల్​ ఇంజినీర్లు, టౌన్​ ప్లానింగ్​, మెప్మా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్వింద్‌ కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి కమిషనర్లు బాధ్యతగా వ్యవహరించాలని, 8రోజుల పట్టణ ప్రగతి కార్యక్రమం తర్వాత సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు, డెబ్రీస్‌లతో పాటు పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. సీజనల్​ వ్యాధులను పారదోలడమే లక్ష్యంగా నిర్దేశించిన ‘ప్రతి ఆదివారం- 10గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులందరూ భాగస్వాములు అయ్యే విధంగా చూడాలన్నారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తిని నిరోధించేందుకు యాంటీ లార్వా ఆక్టివిటీ విస్తృతంగా నిర్వహించాలని, అవసరమైన మేరకు స్ర్పేయర్లు, దోమల నివారణ యంత్రాలు(ఫాగింగ్​ మిషిన్స్​) సమకూర్చుకోవాలన్నారు. మున్సిపల్​ డైరెక్టర్​ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషనర్లు కార్యాచరణతో ముందుకు సాగాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed