ఏంటి ఈ నిర్లక్ష్యం… జాతీయ జెండాపై ఇంత చిన్నచూపా..?

by Anukaran |   ( Updated:2021-06-02 08:02:51.0  )
ఏంటి ఈ నిర్లక్ష్యం… జాతీయ జెండాపై ఇంత చిన్నచూపా..?
X

దిశ,మానకొండూరు : దేశంలో జెండాలు ఎక్కువై పార్టీ జెండాకు ఉన్న విలువ జాతీయ జెండాకు లేకుండా పోయిందని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. తిమ్మాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బంది ‌‌‌‌‌‌‌‌‌నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జాతీయ జెండా కు అవమానం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నేదునూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హడావుడిగా వెళ్లిపోయాడు.

దీంతో త్రివర్ణపతాకం కిందకు జారీ జెండా కర్రకు మధ్యలో వేళాడాటం‌ చూసిన స్థానికుల ప్రధానోపాధ్యాయుని ఫోన్ ద్వారా వివరణ కోరగా సిబ్బందిని పంపించి సరిచేసారు‌. ఉదయం 11గంటల15నిమిషాలా సమయంలో పాఠశాల సిబ్బంది ఎవరూ కనిపించకపోవడం జాతీయ జెండాకు అవమానం జరగడంపై విద్యా బుద్దులు నేర్పించాల్సిన విద్యాలయాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో పలువురు గ్రామ ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన పై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

Advertisement

Next Story