కొప్పుల ఈశ్వర్‌‌కు ఘోర అవమానం.. TRS కార్యకర్త ఏం చేశాడంటే(వీడియో)

by Anukaran |
కొప్పుల ఈశ్వర్‌‌కు ఘోర అవమానం.. TRS కార్యకర్త ఏం చేశాడంటే(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ హుజురాబాద్‌లో రాజకీయం వేడెక్కుతోంది. పార్టీ ప్రచారాలతో నేతలు బిజీబిజీగా ఉన్నారు. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. తన రాజకీయ భవిష్యత్తుకు సవాల్‌గా మారిన ఈ ఉప ఎన్నికలో గెలవడానికి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరిన నాటి నుంచే ప్రజల్లోనే తిరుగుతున్నారు. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

అయితే గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఘోర అవమానం జరిగింది. ప్రచారంలో సభా వేదికపై కొప్పుల ప్రసంగిస్తుండగా.. అదే సమయంలో వేదికపైకి ఆర్థిక మంత్రి హరీష్ రావు వచ్చారు. దీంతో పక్కనే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్త కొప్పుల మాట్లాడుతుండగానే.. ఆయన చేతిలో నుంచి మైక్ లాక్కొని మంత్రి హరీష్‌కు స్వాగతం పలికారు. దీంతో ఒక్కసారిగా షాకైన కొప్పులు ఈశ్వర్ చేసేదేమీ లేక సైడ్ అయిపోయారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story