గాంధీజీకి అవమానం ఎక్కడో తెలుసా ?

by Shyam |
గాంధీజీకి అవమానం ఎక్కడో తెలుసా ?
X

దిశ నాగర్ కర్నూల్ : దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరుగక శ్రమించిన మేధావి స్పూర్తితో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం బోర్డులపై అవమానం జరుగుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం అనంతారం గ్రామంలో ఇలా గడ్డం, మీసాలతో గాంధీజీ బొమ్మలు దర్శనమిస్తున్నాయి. పెయింటర్ నిర్వాకం, అధికారుల అలసత్వం వెరసి మహాత్ముడికి అవమానం ఎదురైందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అవమానకరంగా చిత్రాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story