- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే ఏడాదిలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది: జేఎల్ఎల్ ఇండియా..
దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాదిలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ఇండియా అభిప్రాయపడింది. 2020లో అత్యధికంగా నిధుల ప్రవాహం పెరగడంతో ప్రస్తుత కేలండర్ ఏడాది రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు 20 శాతం క్షీణింణించే అవకాశాలు ఉన్నాయని సంస్థ తెలిపింది. 2021లో సుమారు రూ. 30 వేల కోట్ల విలువైన సంస్థాగత పెట్టుబడులు నమోదవచ్చని జేఎల్ఎల్ ఇండియా పేర్కొంది. అయితే, ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య సంస్థాగత పెట్టుబడులు రూ. 22.3 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, గతేడాది ఇదే సమయంలో ఈ పెట్టుబడులు రూ. 11.5 వేల కోట్లుగా నమోదయ్యాయని జేఎల్ఎల్ ఇండియా వివరించింది.
ఈ ఏడాది చివరి నాటికి పెద్ద మొత్తం ఒప్పందాలు కుదరకపోతే మొత్తం వార్షిక పెట్టుబడులు రూ. 28-30 వేల కోట్లకు పరిమితమవుతాయని, ఇది గతేడాది కంటే తక్కువే అని జేఎల్ఎల్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. గతేడాది చివర్లో రూ. 24 వేల కోట్ల విలువైన ఒప్పందాల కారణంగా 2020 ఏడాది మొత్తానికి సంస్థాగత పెట్టుబడులు 5 బిలియన్ డాలర్లు, మన కరెన్సీలో రూ. 37.5 వేల కోట్ల మార్కును అధిగమించింది. ఇక, వచ్చే ఏడాదిలో కూడా రియల్ ఎస్టేట్ రంగం 5 బిలియన్ డాలర్ల విలువ పెట్టుబడులను సాధించే అవకాశాలున్నాయని జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది. ఇదివరకు 2017-2020 మధ్య ప్రతి ఏటా రియల్ ఎస్టేట్ రంగం 5 బిలియన్ డాలర్ల మార్కును సాధిస్తూ వస్తోంది. 2021లో మాత్రమే ఈ రంగంలో నిధుల ప్రవాహం తగ్గిందని జేఎల్ఎల్ ఇండియా పేర్కొంది.